మన్యం న్యూస్ కరకగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే, బిఅర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేడియో కాంతారావు,సుధారాణి దంపతులు స్వగ్రామంలో 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టిన బతుకమ్మ గాటు పనులను అగ్రామ మహిళలతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని,దీనిలో బగంగానే మహిళల కు బతుకమ్మ చీరలు,పెదింటి అడ పడుచుల పెళ్లి కానుకగా కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ వంటి పథకాలు తిసుకొచ్చారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి రేగా కాళికా, గ్రామ ప్రజలు,మహిళలు పాల్గొన్నారు.
