మన్యం న్యూస్ కరకగూడెం:తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ వెంటేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. దేశ,రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలనీ,రైతులు అందరు పాడిపంటలతో విలసిల్లాలని ప్రజలందరూ ఆనందంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా. కాళికా, బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమరం. రాంబాబు, మండల అధ్యక్షులు రావుల. సొమయ్య,ఆత్మ కమిటీ డైరెక్టర్ కొంపల్లి పెద రామలింగం, ఉపసర్పంచ్ రావుల రవి, తదితరులు పాల్గొన్నారు.
