మన్యం న్యూస్,ఇల్లందు:
ఏఐటియుసి అనుబంధ సింగరేణి కంపెనీ ఇల్లందు ఏరియా స్థానిక జెకెఓసి డిబ్లాక్ లొడింగ్, అన్ లొడింగ్, లెవలింగ్ టార్ఫాలిన్ కార్మికుల యూనియన్ ఆద్వర్యంలో గురువారం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని స్థానిక ఏరియా జనరల్ మేనేజర్ జాన్ ఆనంద్ కు ఎఐటియుసి నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం వర్కర్స్ యునీయన్ ఇల్లందు బ్రాంచి ఉపాద్యక్షులు ఎస్వీ రమణ, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి దేవరకొండ శంకర్లు మాట్లాడుతూ.. సింగరేణి కంపెనీని నమ్ముకొని అనేక సంవత్సరాలుగా స్థానిక జేకె ఓసి డిబ్లాక్ ఏరియాలొ కోల్ లొడింగ్ వద్ద లారి లొడింగ్, అన్ లొడింగ్, లెవలింగ్, టార్ఫాలిన్ పనులు నిర్వహిస్తు తమ కుటుంబాలని పొషించుకుంటున్న కార్మికుల పరిస్థితి నేడు దయనీయంగా మారిందని తెలిపారు. నెలరోజులుగా బొగ్గు లొడింగ్ లేకపొవడం వలన కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని లొడింగ్, అన్ లొడింగ్ కార్మికులు కేవలం కొల్ ట్రాన్స్ పొర్టు ద్వారానే జీవనం సాగిస్తున్నారని వీరు మాత్రమే కాకుండా కొల్ లొడింగ్ పై ఆధారపడిన లారి ఓనర్లు, గుమస్తాలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు అని పేర్కొన్నారు. లారీఓనర్లు కొల్ లొడింగ్ లేకపొవడం వలన కిస్తిలు కట్టడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. గుమస్తాలు కూడా దినిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని ప్రత్యక్షంగా పరొక్షంగా వందల కుటుంబాలు కొల్ ట్రాన్స్ పొర్టుపై ఆధారపడి ఉన్నాయన్నారు. త్వరగతిన జేకెఓసి బొగ్గు ఉత్పత్తి చేపట్టి కొల్ ట్రాన్స్ పొర్ట్ పై ఆధారపడి జీవిస్తున్న లొడింగ్, అన్ లొడింగ్, లెవలింగ్, టార్ఫాలిన్ కార్మికులు, లారి యజమానులు, గుమస్తాల కుటుంబాలలో వెలుగులు నింపాలని వారు జీఎంకి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి బందం నాగయ్య, ఎఐటియుసి డివిజన్ కార్యదర్శి ఎండి నజీర్ అహ్మద్, సహయ కార్యదర్శి షేక్ షంశుద్దిన్, లొడింగ్, అన్ లొడింగ్ నాయకులు సూరిబాబు, నెల్లి కొమరయ్య, కృష్ణ, లక్ష్మణ్, వేంకటేశ్వర్లు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.