మన్యం న్యూస్ చండ్రుగొండ,జూన్ 29: అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావుపై విమర్శలు చేయటం అర్ధరహితమని బిఆర్ఎస్ మండల కమిటి ముక్తకంఠంతో ఖండించింది. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ మండల కమిటి నాయకులు మాట్లాడుతూ… ఎమ్మేల్యేపై పార్టీ నుండి బయటకు వెళ్లి పొంగులేటి వర్గం అంటూ చెప్పుకుంటూ ఇప్పుడు ఆరోపణలు చేయటం అర్ధరహితమన్నారు. పేదలకు అండగా ఉండే మెచ్చాను ఓడిస్తామని చెప్పటం,విడ్డూరంగా ఉందన్నారు. అన్నివర్గాలకు అండగా, అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మేల్యేపై ఆరోపణలు చేస్తే ఇక చూస్తూ ఊరుకోబోమన్నారు. అభివృద్ధికి కేరాఫ్ చండ్రుగొండ మండలాన్ని తీర్చిదిద్దటం జరిగిందని, అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు వేయటం జరిగిందన్నారు. అర్ధంపర్ధం లేని ఆరోపణలు చేసి మండల ప్రజలను తప్పుదోవపట్టించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు దారా వెంకటేశ్వరరావు (దారా బాబు), గుంపెన సోసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, మాజీ సర్పంచ్ గుగులోత్ రమేష్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మేడా మోహన్ రావు, గూగుల్ శ్రీనివాస్ నాయక్, జక్కుల రాంబాబు, సయ్యద్ గఫర్ మియా, కాకా లక్ష్మయ్య, రామిశెట్టి రామారావు, తదితరులు పాల్గొన్నారు.