*మన్యం న్యూస్ గుండాల..
త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు గురువారం ఘనంగా నిర్వహించుకున్నారు. మండల కేంద్రంతో పాటు కాచనపల్లి మసీదులలో బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరిని ఒకరు అలై బలై చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గుండాల కాచనపల్లి ముస్లిం సోదరులు అఙ్గర్,యాకూబ్, సాబీర్, అబ్దుల్ నబీ, రషీద్, సాహెబ్, అక్తర్, మహమూద్, మౌళిసాబ్ అక్తర్ అన్సారి, సుభాని, పాష, ఖదీర్, యూసుబ్, మగ్బూల్, యాకూబ్, జావీద్, వాజిద్, నయీమ్, ఫసి, ముజీబ్, షకీల్, కుదూస్, అజ్జు, రోషన్, ఇస్రార్, సమీర్, పప్పీ, రేహాన్, అప్రోస్, ఇమ్రాన్, షారుఖ్, రహీం తదితరులు పాల్గొన్నారు.
