మన్యం న్యూస్ చండ్రుగొండ, జూన్ 29 : మండల వ్యాప్తంగా బక్రీద్ పండుగను భక్తి శ్రద్దలతో నిర్వహించుకున్నారు. గురువారం తిప్పనపల్లి, చండ్రుగొండ గ్రామాల శివారులోని ఈద్గాల వద్ద ముస్లీంలు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ… త్యాగాలకు, దాన, ధర్మాలకు ప్రతీక బక్రీదు పండుగ అన్నారు. ప్రతి యొక్కరు తాను సంపాదించిన దానిలో కొంత పేదలకు దానధర్మాల రూపంలో ఇతరులకు పంచాలన్నారు. తద్వారా సమాజంలో హెచ్చుతగ్గులు తగ్గుతాయన్నారు. తిప్పనపల్లి ఈద్గా వద్ద జరిగిన ముస్లీంల ప్రత్యేక ప్రార్ధనలో జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్ పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.
