త్యాగానికి, సామరస్యానికి ప్రతీక బక్రీద్
ముస్లిం మైనార్టీలను వెలివేసే కేంద్రం కుట్రలను తిప్పికొట్టాలి
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
ముస్లీం కుటుంబాలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన కూనంనేని
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
త్యాగానికి, సామరస్యానికి ప్రతీక బక్రీద్ పండుగ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం మాజీ శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని గురువారం పట్టణ పరిధిలోని బొడగుట్ట, రుద్రంపూర్ ఈద్గా, మసీదుల్లో జరిగిన ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ముస్లీం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ప్రజాస్వామ్య భారత దేశంలో అన్ని పండుగలకు కులమతాలకతీతంగా జరుపుకోవడం హర్షణీయమన్నారు. రాగద్వేశాలు వీడనాడి ప్రతి ఒక్కరు సామరస్యా భావాలతో కలిసి మెలిసి జీవించాలని తద్వారా సమాజంలో శాంతిని నెలకొల్పాలన్నారు. పేద, ధనిక తారాత్యమ లేకుండా పండుగ ఉత్సవాలను అందరూ జరుపుకోవాలని, పండుగలు జరుపుకునే స్థితిలో లేని పేదలకు తమవంతు కర్తవ్యంగా తోడ్పాటును అందించి పండుగ వేడుకల్లో భాగస్వామ్యం చేయడం అభినందనీయమన్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ ముస్లిం మైనార్టీలను దేశద్రోహులుగా ముద్రిస్తూ వెలివేసే కుట్రలకు పాల్పడుతోందన్నారు. ఎన్ఆర్సి, సీఏఏ చట్టాలను తీసుకువచ్చి ముస్లిం మైనార్టీలను ముప్పుతిప్పలు పెడుతోందన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బంగడుపుకునే నీచ రాజకీయాలకు పాల్పడుతోందని, ఈ కుయుక్తులను కలిసికట్టుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కూనంనేని వెంట సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా, ముస్లీం మైనార్టీ నాయకులు నయిమ్ ఖురేషి, ఇర్ఫాన్, రజాక్, ముక్తియార్, జాహెద్, షాబుద్దీన్, షకీల్ నాయకులు వై.శ్రీనివారెడ్డి, కంచర్ల జమలయ్య తదితరులు పాల్గొన్నారు.