మన్యం న్యూస్ బూర్గంపహడ్:- సారపాకలో శుక్రవారం స్థానిక వాసవి ఫంక్షన్ హాల్ లో జరిగిన
బిఆర్టియు ముఖ్య కార్యకర్తల సమావేశంలో
బిఆర్టియు జిల్లా అధ్యక్షులు కనీస వేతనాల బోర్డు మెంబర్ మరియు ఐటిసి యూనియన్ అధ్యక్షులు శ్రీ సానికొమ్ము శంకర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ గంజి రాంబాబుకి ఐటిసి పిఎస్పీడీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై మినిమం వేతనం బిల్లు,ఈ ఎస్ఐ హాస్పిటల్ విషయం పై వారికి కాంట్రాక్టు కార్మికుల తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది.వారు సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో మాట్లాడి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఐటీసీ ఎంప్లాయి బిట్ర సాయిబాబా,ఐటీసీ కాంట్రాక్ట్ కార్మికులు,చుక్కపల్లి బాలాజీ,చట్టు ఆంజనేయులు,సానికొమ్ము రామచంద్ర రెడ్డి,పి నరసింహ రావు,రాయల నాగరాజు,జినుగు దాసు పార్టి నాయకులు తదితరులు పాల్గొన్నారు