UPDATES  

 దేశంలోనే రిచెస్ట్ కమెడియన్ గా బ్రహ్మానందం..

మనదేశంలో రిచెస్ట్ కమెడియన్ ఎవరనేదానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. కపిల్ శర్మపై, లేదంటే జానీ లీవర్, పరేష్ రావల్ లేదా రాజ్‌పాల్ యాదవ్ లాంటి సీనియర్ కమెడియన్స్ అని అందరూ అనుకున్నారు.

అయితే ఓ వార్తాసంస్థ కథనం ప్రకారం ఆ టాప్ ర్యాంకర్ మనవాడే.. మన తెలుగువాడే.. కన్నెగంటి బ్రహ్మానందం. ఆ వార్తా కథనం ప్రకారం బ్రహ్మానందం నెట్ వర్త్ 50 మిలియన్ డాలర్లకు పైనే ఉంది.

తాను నటించే సినిమాలన్నింటికీ కలిపి నెలకు రూ.2కోట్ల పారితోషిఖం బ్రహ్మానందం తీసుకుంటారు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ డీల్స్‌ కోటి రూపాయలపైనే ఉంటాయి. 1000 చిత్రాల్లో నటించిన నటుడిగా బ్రహ్మీ ఎప్పుడో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. సినీ పరిశ్రమలో కళామ తల్లికి చేసిన కృషికి గాను పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఇప్పటికీ దేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న హాస్యనటుల్లో బ్రహ్మానందం ముందు వరుసలో ఉన్నారు.

అహ నా పెళ్లంట, మనీ, అన్న, అనగనగా ఒక రోజు, వినోదం, రెడీ, మన్మధుడు, రేసు గుర్రం, దూకుడు, బాద్ షా.. ఇలా చెప్పుకుంటూ పోతే బ్రహ్మీ ఖాతాలో ఎన్నో సినిమాలున్నాయి. ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో తన కామెడీతో ఆడియెన్స్ ని కడుపుబ్బా నవ్వించారు. ప్రజల్లో వెలకట్టలేనంత అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకోవడంలోనూ బ్రహ్మానందం నెట్ వర్త్ వెల కట్టలేనిది. ఆయన దగ్గర ఆడి R8, ఆడి Q7, బ్లాక్ లగ్జరీ మెర్సిడెస్-బెంజ్ వంటి అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి.

ఇటీవలే రంగమార్తాండ సినిమాలో బ్రహ్మీ సీరియస్ క్యారెక్టర్ చేశారు. ఈ పాత్రతో ఆయన నటనలో మరో కోణం ఆవిష్కృతమైంది. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించికపోయినప్పటికీ అందులో నటించినవారందరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది. హాస్యమే కాకుండా ఎటువంటి పాత్రనైనా తాను అవలీలగా చేయగలను అని బ్రహ్మీ మరోసారి నిరూపించుకున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !