బెంగళూరు/బళ్లారి: కొడుకును బాగా చదివించాలని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు. వేరే ఊరిలోని కాలేజ్ లో చదువుకుంటున్న యువకుడు సెలవులు, పండుగల రోజు ఊరికి వెళ్లి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసి తరువాత మళ్లీ కాలేజ్ కు వెలుతున్నాడు.
పండగ సందర్బంగా ఊరికి వెళ్లిన యువకుడు దారుణ హత్యకు గురైనాడు.
కర్ణాటకలోని బళ్లారి సిటీలో లియాఖత్ ఆలీ అలియాస్ రోషన్ (24) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కలబురిగిలోని అరబిక్ కాలేజ్ లో రోషన్ చదువుకుంటున్నాడు. కొడుకు రోషన్ ను బాగా చదివించాలని, అతను బాగా చదువుకున్న తరువాత మంచి ఉద్యోగం చేస్తే మనం జీవితాంతం హ్యాపీగా ఉంటామని రోషన్ కుటుంబ సభ్యులు అనుకున్నారు.
కలబురిగిలో చదువుకుంటున్న రోషల్ కాలేజ్ కు సెలవులు ఇచ్చిన సమయంలో, ప్రభుత్వ సెలవు దినాల్లో బళ్లారిలోని అతని ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యలతో కలిసి సంతోషంగా ఉండేవాడు. బక్రీద్ పండుగ సందర్బంగా రోషన్ కలబురిగి నుంచి బళ్లారికి వచ్చాడు. గురువారం ఉదయం శుభ్రంగా స్నానం చేసిన రోషన్ తండ్రి, బంధువులతో కలిసి వెళ్లి ఈద్గా మైదానంలో ప్రార్థనలు చేసి ఇంటికి వెళ్లాడు.
నువ్వు ఎంత మందితో ఎంజాయ్ చేస్తే నేను అంత హ్యాపీగా ఉంటా, లేడీ టెక్కీతో భర్త !
మద్యాహ్నం అమ్మా బిర్యానీ చెయ్యడంతో ఇంట్లో హ్యాపీగా తిన్న రోషన్ రాత్రి 7 గంటల వరకు ఇంట్లోనే ఉన్నాడు. తరువాత రోషన్ స్నేహితులు మందు పార్టీ పెట్టుకోవడంతో ఆ పార్టీకి వెళ్లాడు. మందు పార్టీలో అందరూ ముస్లీం యువకులే ఉన్నారు. మద్యం మత్తులో రోషన్ తో అతని స్నేహితులు గొడవపడ్డారు. ఆ సందర్బంలో మాటామాటా పెరిగిపోవడంతో పెద్ద గొడవ జరిగింది.
ఆ సందర్బంలో సహనం కోల్పోయిన యువకులు కత్తులతో రోషన్ మీద దాడి చేశారు. తీవ్రగాయాలైన రోషన్ ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై రోషన్ శుక్రవారం చనిపోయాడు. కాలేజ్ లో చదువు కుంటున్న కొడుకు బక్రీద్ పండుగకు వచ్చి హత్యకు గురి కావడంతో అతని కుటుంబంలో విషాదచాయలు నెలకొన్నాయి. అయితే రోషన్ హత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, కేసు విచారణలో ఉందని బళ్లారి పోలీసులు తెలిపారు.