తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత చిన్న వయసు కలిగిన హీరోయిన్లలో కృతిశెట్టి ఒకరు. ఉప్పెన సినిమాతో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ఈ అమ్ముడు మంచి క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ ఆ తర్వాత నటించిన సినిమాలు కొన్ని ఆశించిన ఫలితాలివ్వలేదు.
దీంతో ఆమె ఇండస్ట్రీలో కాస్తంత డల్ అయింది . ఈ తరుణంలోనే శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి సినిమాల్లో నటించి విజయాల బాట పట్టింది. మళ్లీ ఈ సినిమాల తర్వాత కృతిశెట్టి నటించిన సినిమాలు విజయం సాధించలేకపోయాయి.
టాలీవుడ్ లో హిట్ సినిమాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అక్కడ సూర్య, కార్తి వంటి స్టార్ హీరోలతో కలిసి నటిస్తోంది. కోలీవుడ్ లో కూడా నెమ్మది నెమ్మదిగా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇదిలావుండగా ఓ స్టార్ హీరో కొడుకు నుంచి కృతికి ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. కృతితో స్నేహం చేయాలని చూస్తుంటే.. ఈమెకు మాత్రం అస్సలు ఇష్టం లేదట.
కృతి ఎక్కడికి వెళ్లినా ఆ హీరో కొడుకు కూడా ఆమె వెంటే వెళ్తూ విసిగిస్తున్నాడట. ఆ వ్యక్తి పుట్టిన రోజు ఉండటంతో కృతిశెట్టిని షూటింగ్ వదులుకొని రావాలని బలవంతం చేశాడట. నీకు ఎన్ని కోట్లు కావాలన్నా ఇస్తానని.. నా పుట్టిన రోజుకి రావాలంటూ ఫోన్ చేశాడని, అలా ప్రతిరోజు తనతో ఉండాలని ఫోన్లు చేస్తూ విసిగిస్తున్నాడని కృతిశెట్టి ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పింది. కృతిశెట్టి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.