హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్- ఉపాసన కుమార్తెకు పేరు పెట్టారు. క్లిన్ కారా కొణిదెల అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా ప్రకటించారు.
దీనికి అర్థాన్ని కూడా వివరించారాయన. లలిత సహస్ర నామాల నుంచి ఈ పేరును ఎంపిక చేసినట్లు వివరించారు. క్లిన్ కారా అనేది ప్రకృతి స్వరూపాన్ని సూచిస్తుంది.
ప్రపంచం మొత్తానికీ శక్తిని ప్రసాదించే అమ్మవారి సహస్రనామాల్లో క్లిన్ కారా ఒకటి. అమ్మవారి అసమాన శక్తికి ఈ పదం అద్దం పడుతుంది. అపారమైన శక్తిని తనలో నిక్షిప్తం చేసుకుందనడానికి నిదర్శనంగా లలిత సహస్ర నామాల్లో క్లిన్ కారా అనే పేరును ఉపయోగిస్తారు. అత్యంత శక్తివంతమైన చైతన్యాన్ని కలిగి ఉంటుంది ఈ పేరు.
తమ ఇంట్లో అల్లారుముద్దుగా పెరిగే ఈ లిటిల్ ప్రిన్సెస్ తన వ్యక్తిత్వంలో ఈ లక్షణాలన్నింటినీ ఇమిడ్చుకుంటుంది. తను పెరిగే కొద్దీ అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది.. అంటూ ఆ పేరు వెనుక గల పరమార్థాన్ని మెగాస్టార్ చిరంజీవి వివరించారు. భార్య, వియ్యంకుడితో కలిసి దిగిన ఓ ఫొటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ నెల 20వ తేదీన ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అపోలో ఆసుపత్రిలో ఆమె ప్రసవించారు. 23వ తేదీన డిశ్చార్జ్ అయ్యారు. ఇవ్వాళ ఆ చిన్నారికి నామకరణ మహోత్సవాన్ని నిర్వహించారు. రామ్ చరణ్, ఉపాసన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, కొద్దిమంది సన్నిహితుల మధ్య ఈ వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి.