UPDATES  

 పోడు భూములకు రైతు బంధు విడుదల..

సీఎం కేసీఆర్ పోడు రైతులకు శుభవార్త చెప్పారు. పోడు రైతులపై గతంలో ఉన్న కేసులన్నీ ఎత్తివేయాలని డీజీపీని ఆదేశించారు. శుక్రవారం సీఎం కేసీఆర్ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు.

ఈ సందర్భంగా పోడు భూములకు రైతుబంధు విడుదల చేశారు. పోడు రైతులకు రూ.23.56 కోట్ల చెక్ లను పంపిణీ చేశారు. రెండు మూడు రోజుల్లో పోడు పట్టాల పంపిణీ పూర్తి చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా లక్షన్నర ఎకరాలకు పట్టాలు ఇస్తామన్నారు. పోడు పట్టాలను మహిళల పేరు మీదనే ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. మారుమూల గ్రామాల్లో అన్ని పొలాల వరకు త్రీ ఫేజ్ కరెంట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్ వన్ గా ఎదుగుతుందని చెప్పారు. ఇప్పటివరకు గిరిజన గ్రామాలకు కరెంటు సదుపాయం కల్పన దాదాపు పూర్తయ్యిందని, ఇకపై అన్ని జిల్లాల్లో మారుమూల గ్రామాల్లో ఉన్న గిరిజనుల పొలాలకు కూడా త్రీఫేజ్‌ కరెంటు ఇస్తామని సీఎం ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా లక్షా 51 మంది రైతులకు నాలుగు లక్షల 50 వేల ఎకరాల పోడు భూమిని పట్టాలు ఇచ్చి పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగులంతా సహకరించారని సీఎం గుర్తుచేసుకున్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా తాను ఏ పిలుపునిచ్చినా ఉద్యోగులు శక్తివంచన లేకుండా తమవంతు కృషిచేశారని సీఎం గుర్తు చేశారు.

జిల్లాలో డిస్ట్రిక్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ ఆఫీసెస్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించుకోవడం గొప్ప విషయమన్నారు. త్వరలో మెడికల్‌ కాలేజీ కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. అంతకుముందు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇంటిగ్రేటెడ్‌ ఆఫీసెస్‌ కాంప్లెక్స్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

బీఆర్‌ఎస్‌ పార్ జిల్లా కార్యాలయాన్ని కూడా సీఎం కేసీఆర్ ప్రారంభించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు కోనేరు కోనప్పను కూర్చీలో కూర్చోబెట్టారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !