చెన్నై/కన్యాకుమారి: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లికావడంతో దంపతుల ఇరువైపుల కుటుంబ సభ్యులు వారి ఇంటికి వచ్చి వెలుతున్నారు.
ఇటీవల దంపతుల మధ్య తేడాలు వచ్చాయి. తరువాత పొలంలో భార్య శవం అయ్యింది. మహిళ శవం అర్దం కాలిపోవడంతో కలకలం రేపింది.
ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ టార్చర్, అనంతపురం లేడీ టెక్కీ చేసిన పనితో !
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని తాడియూర్ సమీపంలోని చెరుకోల్ లో సెల్వరాజ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన సెల్వీ అనే మహిళను సెల్వరాజ్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తరువాత సెల్వరాజ్, సెల్వీ దంపతులు హ్యాపీగా కాపురం చేశారు.
సెల్వరాజ్, సెల్వీ దంపతులకు స్టాలిన్ దాస్ అనే కుమారుడు, షైనీ అనే కుమార్తె ఉన్నారు. భర్త సెల్వరాజ్, ఇద్దరు పిల్లలతో కలిసి సెల్వీ చాలా సంతోషంగా జీవించిందని తెలిసింది. అయితే ఇటీవల సెల్వీ తీరులో మార్పులు రావడంతో ఆమె భర్త సెల్వరాజ్ అతని భార్యతో గొడవలు పడటం మొదలుపెట్టాడని వెలుగు చూసింది.
సెల్వరాజ్, సెల్వీ దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఊరి సమీపంలోని ఓ పొలంలో సెల్వీ శవం అయ్యి కనిపించింది. విషయం తెలుసుకున్న డీసీపీ ఉదయ్ సూర్యన్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సెల్వీ శవం అర్దం కాలిపోయిందని, సెల్వీ శవం సమీపంలోనే రెండు పెట్రోల్ డబ్బాలు పడిఉన్నాయని పోలీసులు తెలిపారు.
సెల్వీని పొలంలోకి ఎవరు పిలుచుకుని వచ్చారు ?, ఆమెను ఎవరు హత్య చేశారు అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. వివాహిత మహిళను హత్య చేసి తరువాత ఆమె శవాన్ని కాల్చి బూడిద చెయ్యడానికి ప్రయత్నించిన సంఘటన కన్యాకుమారి జిల్లాలో కలకలం రేపింది. సెల్వీ భర్త సెల్వరాజ్ నుంచి సమాచారం సేకరిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. సెల్వీకి అక్రమ సంబంధం ఉందని ఆమె భర్త సెల్వరాజ్ కు అనుమానం ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.