మన్యం న్యూస్ బూర్గంపహడ్:- పోడు పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పాల్వంచ లోని సుగుణ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ హరీష్ రావు సమక్షంలో పలువురు లబ్ధిదారులకు పోడు పట్టాలు పంపిణీ చేశారు ఈ క్రమంలో ఇరవెండి గ్రామపంచాయితికి చెందిన రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేయడం పై హర్షం వ్యక్తం చేశారు,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కి పోడు ప్రజలు రుణపడి ఉంటారని ఆ గ్రామ పంచాయతీ మాజీ ఎంపీటీసీ సభ్యులు వళ్లురుపల్లి వంశీ తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోర్సా లక్ష్మి,ఎంపిఓ సునీల్ కుమార్,పంచాయితి కారదర్శి దివ్య రైతులు సోడే గోపయ్య,కనితి లింగయ్య,ఇర్ఫా తారా దేవి,భూక్య రాములు,నూపా మణి,కేలోతు దుర్గ,లకావత్ గోపాల్,ధనసరి పోతురాజు తదితరులు పాల్గొన్నారు.