- పోడు గోడుకు శాశ్వత వీడ్కోలు పలికాం*
- స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఇచ్చినవి మూడు లక్షల ఎకరాలు
- ఒకే రోజు నాలుగు లక్షల ఆరువేల పైచిలుకు ఎకరాలను పంపిణీ చేశాం
- పోడు సమస్యను పరిష్కరించడం కోసమే పార్టీ మారాను ప్రభుత్వ విప్ రేగా
మన్యం న్యూస్ గుండాల: పోడు గోడుకు శాశ్వత వీడ్కోలు పలికామని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. పాల్వంచలో జరిగిన పోడు పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి మూడు లక్షల ఎకరాలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పంపిణీ చేస్తే ఒకే ఒక్క రోజు నాలుగు లక్షల 6 వేల పైచిలుకు ఎకరాల భూమిని పంపిణీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పంపిణీ చేయడం జరిగితే అందులో పినపాక నియోజకవర్గంనికి ఎక్కువ ఎకరాలను పోడు రైతులకు అందించడం జరిగిందన్నారు. ప్రతిపక్ష నాయకులు రేగా కాంతారావు పార్టీ మారాడు అమ్ముడుపోయాడు అంటూ తప్పుడు మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారే తప్ప వాళ్లు ఏనాడు ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం పలకడం కోసమే పార్టీ మారడం జరిగిందని ఆ సంకల్పాన్ని ఆదివాసీల ప్రజల చిరకాల కోరికను తీర్చాలని ఆయన పేర్కొన్నారు. ఈ పట్టాలతో లబ్ధిదారుడికి 10 ప్రయోజనాలు చేకూరానున్నాయని ఆయన అన్నారు. పినపాక నియోజకవర్గం లో పోడు సాగు రైతులు సమస్యలు ప్రత్యేక ఫారెస్ట్ అధికారులతో తలెత్తేవని అలాంటి సమస్యలన్నిటికీ స్వస్తి పలకడం జరిగిందన్నారు ఈ పోడు పట్టా పొందిన ప్రతి రైతు ఖాతాలో రైతు బంధు జమ అవుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయలేని విధంగా పోడు సమస్య పరిష్కరించడం కోసం ఎంతో కృషి చేశానని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు పోడు గోడు ముగిసిందని తెలుసుకోవాలని వారికి ఆయన సూచించారు. ఇప్పటికే నియోజకవర్గానికి వందల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి అభివృద్ధి పథంలో పినపాక నియోజకవర్గం నిలిపానని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకులు వారు చేసిన అభివృద్ధి చెప్పుకోవడానికి ఏమీ లేక అనవసరపు రాద్ధాంతాలు చేస్తున్నారే తప్ప ప్రజలకు మేలు చేయడం కోసం వారు ఏనాడు ప్రయత్నించలేదని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు చాలా ఆలోచన కలిగిన ప్రజలని అభివృద్ధిని చూసి చేసింది ఎవరని తెలుసుకొని వారే నిర్ణయించుకునే సత్తా వారిలో ఉందని ఆయన అన్నారు. రానున్న సమరంలో రాష్ట్రంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీ ఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కథనరంగంలో విజేతగా నిలుస్తారని ఆయన అన్నారు
