మన్యం న్యూస్ గుండాల: మత్తులో పురుగుల మందు తాగి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొట్టెం ప్రభాకర్ మద్యానికి బానిసై ఇక మద్యం సేవించడంతో భార్య తాగొద్దు అని చెప్పినందుకు శనివికావేశానికి లోనైన ప్రభాకర్ పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు మృతిని భార్య ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసిన గుండాల ఎస్సై కిన్నెర రాజశేఖర్ మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించి శవ పరీక్ష అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు
