మన్యం న్యూస్,ఇల్లందు:టేకులపల్లి మండలం మొక్కంపాడు గ్రామపంచాయతీకి చెందిన కుంజ వెంకటేశ్వర్లు పొలం దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి తీవ్ర గాయాలపాలై శనివారం మృతి చెందటం జరిగింది. ఈ సమాచారం తెలుసుకున్న ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ శనివారం వారి స్వగృహానికి వెళ్లి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసి, తన ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట స్థానిక సర్పంచ్ బానోత్ విజయ, నాయకులు బానోత్ రామనాయక్, బానోత్ వాలు, అజ్మీర రవి, బానోత్ బాలు, మాలోత్ బీమానాయక్, బానోత్ రవి, గుగులోతు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.