- అమ్మ జన్మనిస్తుంది వైద్యులు పునర్జన్మనిస్తారు
- జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో టి డయాగ్నస్టిక్ కేంద్రం
- ప్రారంభోత్సవంలో శాసనసభ్యులు వనమా
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
అమ్మ జన్మనిస్తే వైద్యులు పునర్జన్మ ప్రసాదిస్తారని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరావు తెలిపారు.శనివారం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో టి డయాగ్నస్టిక్స్ నందు 134 రకాల పరీక్షలు నవీకరణను రాష్ట్ర ఆర్థిక వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి హరీష్ రావు వర్చువల్ ద్వారా హైదరాబాదు నుంచి ప్రారంభించిన కార్యక్రమంలో జిల్లాకలెక్టర్ అనుదీప్ తో కలిసి శాసనసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యాధిసోకిన వ్యక్తులకు వివిధ రకాల పరీక్షలకు పెద్దమొత్తంలో ఖర్చు అయ్యేదని చెప్పారు. ఏ జబ్బు వచ్చిన కాపాడే వాళ్లు డాక్టర్లని చెప్పారు. టి డయాగ్నస్టిక్ కేంద్రం ద్వారా గతంలో 57 రకాల పరీక్షలు నిర్వహించేవారని, నేటి నుంచి 134 రకాల పరీక్షలు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. ఆరోగ్య సేవల్లో
ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. వ్యాధులు ముందస్తు నిర్థారణ ద్వారా ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా మెరుగైన వైద్యసేవలు అందించనున్నట్లు చెప్పారు. వైద్య పరీక్షలు నిర్వహణకు సిఎం కేసీఆర్ మహోన్నతకార్యక్రమం చేపట్టారని అన్నారు.. మన జిల్లాకు వైద్య కళాశాలను కూడా మంజూరు చేశారని ఆయన గుర్తు
చేశారు. కొత్తగూడెం, పాల్వంచలలో బ్రహ్మాండమైన ఆసుపత్రులు నిర్మించుకున్నామని వ్యాధి నిర్ధారణ. పరీక్షలకే రూ.5 వేల నుంచిరూ.10 వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చేదని, నేడు అన్ని పరీక్షలు ఉచితంగా చేస్తున్నట్లు చెప్పారు.ప్రభుత్వాసుపత్రుల్లో విప్లవాత్మకమైన మార్పు రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. జిల్లాలో
మెడికల్ కళాశాలతో పాటు 150 యంబిబిఎస్ సీట్లతో ప్రారంభించుకున్నామని మన్నారు.. ఎంబిబిఎస్ 2వ సంవత్సరం అనుమతులు కూడా వచ్చాయని మనందరికి ఎంతో సంతోషమని అన్నారు. భద్రాద్రి జిల్లాలో 150 మంది డాక్టర్లును తయారు చేసుకున్నామని, వారందరు మన జిల్లా వాసులకు వైద్య సేవలు అందించనున్నారని తెలిపారు.
సీజనల్ వ్యాధులు నియంత్రణ చర్యలు, కెసిఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, అనీమియా పరీక్షలు పకడ్బందిగా
నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏజన్సీ మారుమూల ప్రాంతమైన మన జిల్లాలో గిరిజనులకు మెరుగైన వైద్యం అందించే దిశగా అధికారులందరూ పనిచేస్తున్నారని అన్నారు. ఓపిలోటార్గెట్ ఫిక్స్ చేసుకుని ఉల్వనూరు, గుండాల,
కరకగూడెం, రాగబోయినగూడెం, వినాయకపురం కానీవ్వండి ఎంత దూరం మండలం అయినా టి డయాగ్నస్టిక్సహబ్ ద్వారా పరీక్షలు అందాలని చెప్పారు. పరీక్షలు నిర్వహణ వల్ల సమస్య పెద్దగా సమస్యగా మారకముందే మనకు తెలిసిపోతుందని,
మధుమేహం వచ్చిన ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవడం వల్ల గ్లూకోస్ లెవల్స్ తెలుసుకుని ముందుగా వైద్య సేవలు తీసుకోవడం వల్ల నియంత్రణ చేసుకోవడానికి అవకాశం ఉన్నట్లు చెప్పారు. హైదరాబాదులోని అపోలో,యశోదా వంటి పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో చేసే అవే పరీక్షలు నేడు మనం టి డయాగ్నస్టిక్స్ హబ్లో ఉచితంగా
చేస్తున్నామని చెప్పారు. టి డయాగ్నస్టిక్స్ సేవలు మన జిల్లా వాసులకు వరంలాగా మారనున్నదని, మందస్తు పరీక్షలునిర్వహించుకుని తదనుగుణంగా వైద్య సేవలు పొందాలని చెప్పారు. 57 రకాల వైద్య సేవలను 134 కు పెంచడానికి అవసరమైన పరికరాలను రూ.కోటి 7 లక్షలతో ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. కరోనా సమయంలో వైద్య సిబ్బందిప్రాణాలను లెక్కచేయక సేవలు అందించారని వారి సేవలను కొనియాడారు.
అనంతరం టి డయాగ్నస్టిక్స్ ద్వారా అందించే 134 రకాల సేవల గోడపత్రికను ఆవిష్కరించి, యంత్రాలను
ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ కాపు సీతాలక్ష్మి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణరావు, ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ కుమారస్వామి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, జడ్పి వైస్ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు,మున్సిపల్ వైస్ ఛైర్మన్ దామోదర్, కౌన్సిలర్ రుక్మాంధర్ బండారి, తహసిల్దార్ శర్మ, ఇతర కౌన్సిలర్లు తదితరులుపాల్గొన్నారు.