UPDATES  

 ఆర్ టీసీ బస్సులను షేక్ చేస్తున్న లేడీస్, కోట్ల మంది ఫ్రీ…ఫ్రీ….ఫ్రీ !

బెంగళూరు/హుబ్బళి/బళ్లారి: కర్ణాటక ప్రభుత్వ కేఎస్ఆర్ టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం ఆర్ టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రకటించింది.

శక్తి పథకం ప్రారంభించినప్పటి నుండి కర్ణాటకలోని నాలుగు రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ల (ఆర్‌టీసీ) సగటు రోజువారీ ఆదాయంలో భారీగా పెరిగిందని అధికారులు చెప్పారు.

ఆదాయానికి సంబంధించిన గణాంకాలను కర్ణాటక ఆర్ టీసీ అధికారులు వెల్లడించారు. రవాణా శాఖ సగటు ఆదాయం 18. 01 శాతం పెరిగిందని అధికారులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఐదు ఎన్నికల హామీల్లో ఒకటైన శక్తి పథకం జూన్ 11వ తేదీన అమలులోకి వచ్చింది. రవాణా శాఖ డేటా ప్రకారం, కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, కళ్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ మొత్తం నాలుగు రవాణా సంస్థలు ఆదాయంలో ఊహించని ఆధాయం పెరిగింది.

ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ టార్చర్, అనంతపురం లేడీ టెక్కీ చేసిన పనితో !

ఆర్ టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్ అమలులోకి వచ్చిన సుమారు 20 రోజుల్లో భారీగా ఆదాయం పెరిగిందని అధికారులు అంటున్నారు. శక్తి పథకం అమలు అయిన తర్వాత కేఎస్‌ఆర్‌టీసీ సగటు రోజువారీ ఆదాయం రూ.9. 95 కోట్ల నుంచి రూ.11. 51 కోట్లకు పెరిగింది. బీఎంటీసీ ఆదాయం రూ. 4.72 కోట్ల నుంచి రూ. 5.18 కోట్లకు పెరిగింది.

ఎన్ డబ్ల్యూకేఎస్ఆర్ టీసీ ఆదాయం రూ.4. 90 కోట్ల నుంచి రూ. 6. 43 కోట్లకు పెరిగింది. సగటు ఆదాయంలో అత్యధికంగా 31.22 శాతం పెరిగింది. ఆ తర్వాత స్థానాల్లో కేకేఆర్‌టీసీ 17.51 ​​శాతం, కేఎస్‌ఆర్‌టీసీ15.68 శాతం, బీఎంటీసీ 9.74 శాతం ఆదాయం పెరిగిందని కర్ణాటక రవాణ శాఖ అధికారులు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !