UPDATES  

 బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్ మూవీ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తర్వాత ప్రాజెక్టుగా అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నారు. సినిమా కథకు సంబంధించిన వీరు ఇప్పటి నుంచే చర్చించుకుంటూ వస్తున్నారు.

బన్నీ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయారు. తర్వాత చేయబోయే సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులుగా ఉండేటట్లు చూసుకుంటూ వస్తున్నారు. ఈ కోవలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్టు చేయబోతున్నారు.

త్రివిక్రమ్ కు కూడా పాన్ ఇండియా స్థాయిలో భారీబడ్జెట్ తో ఓ చిత్రాన్ని తీయాలని కోరికగా ఉండేది. మొదటిగా జూనియర్ ఎన్టీఆర్ తో భారీ సినిమా అనుకున్నారు కానీ అది కుదరలేదు. అలాగే మహేష్ బాబుతో అనుకున్నారుకానీ అదీ కురదలేదు. తాజాగా అల్లు అర్జున్ తోనే త్రివిక్రమ్ కోరిక నెరవేరబోతోంది. పుష్ప2 పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టు మొదలుకాబోతోంది.

గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మించబోతున్న ఈ చిత్రానికి హారిక, హాసిని క్రియేషన్స్ కూడా భాగస్వామి కానుంది. రాజమౌళి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తుంటారు. తర్వాత సుకుమార్ కూడా పుష్ప సినిమాతో భారీ చిత్రాలను రూపొందించే దర్శకుడిగా మారిపోయారు. కొరటాల శివ కూడా దేవర సినిమాను అత్యంత భారీగా చేస్తున్నారు. రూ.80 కోట్ల ఖరీదు చేసే కెమెరాను ఈ సినిమాకు ఉపయోగిస్తున్నారు. ఇలా దర్శకులంతా భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందించేవారుగా మారిపోతుండగా ఇప్పుడు

త్రివిక్రమ్ శ్రీనివాస్ వంతు వచ్చింది. 8 నెలల నుంచి అల్లు అర్జున్, త్రివిక్రమ్ అనేకసార్లు కలిసి స్టోరీని డెవలప్ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం చేస్తున్న మహేష్ బాబు గుంటూరు కారం జనవరిలో విడుదల కానుంది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు కోసం త్రివిక్రమ్ పనిచేయనున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !