UPDATES  

 చేతబడి చేశారని మాయమాటలు చెప్పి లూటీలు చేస్తున్న మాంత్రికుడు. కట్ చేస్తే !

బెంగళూరు/మంగళూరు: ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న మంత్రాగాడి కోసం ప్రజలు గాలిస్తున్నారు. కర్ణాటకలోని కుమట సమీపంలోని ఆమదల్లికి చెందిన మంత్రగాడు ప్రజను మంచేస్తున్నాడు.

చేతబడి చేసి ఉంటే దానిని తొలగిస్తానని దాదాపు 20 ఇళ్లలోని వ్యక్తులకు మాయమాటలు చెప్పి ఒక్కొక్కరికి రూ.20 నుంచి 30 వేల వరకు దండుకుంటున్నాడు. తన మోసం గురించి ప్రజలకు తెలిసిపోవడంతో మంత్రగాడు మాయం అయ్యాడు.

మంజునాథ్ కరియాగౌడ మరియు అతని అక్క కుటుంబం ఇంట్లో సమస్యల గురించి తోడూరుకు చెందిన ఒక వ్యక్తిని సంప్రదించింది. మీ ఇంటికి ఆ వ్యక్తి చేతబడి చేశాడని, దాన్ని తొలగించాలని, ఇందుకోసం కుమటాకు చెందిన మాంత్రికుడిని సంప్రదించాలని మంజునాథ్‌తో పాటు అతని అక్క కుటుంబీకులకు ఆ వ్యక్తి చెప్పారు. మద్యాహ్నం 12 గంటలకు మంజునాథ్ ఇంటికి వచ్చిన మాంత్రికుడు పనులు ప్రారంభించాడు. .

యువకుడి ఇంటికి వచ్చిన మాంత్రికుడు ఒక గుడ్డలో చుట్టిన చెక్కను తీసుకురావడమే కాకుండా, కుటుంబ సభ్యులు అతనికి 12,000 రూపాయలు ఇచ్చారు. ఖతర్నాక్ డబ్బు గుంజుకునే మాంత్రికుడు. కుటుంబ సమేతంగా కాలి బొటనవేలుపై మట్టిని నొక్కుతూ చేతబడి చేసిన వస్తులు తొలగించినట్లు నటించేవాడిలా నాటకాలు ఆడాడు. చెక్క పలకను సున్నితంగా చేతిలో పెట్టి మట్టిలోంచి తీసే విధానాన్ని నాటకీయంగా తెరకెక్కించాడు.

ఆ తర్వాత కుటుంబ సభ్యులందరినీ ఒకరి తర్వాత మరొకరు బయటకు పంపి, ఎవరూ లేని సమయంలో మెల్లగా పాచి కాళ్ల కింద పెట్టాడు. అక్కడి నుంచి డబ్బులు వసూలు చేసి మాంత్రికుడు నేరుగా మధ్యాహ్నం 3 గంటలకు బినగలోని మంజునాథ్ అక్క నాగవేణి ఇంటికి వచ్చాడు. అక్కడ కూడా అదే డ్రామా చేయడం మొదలుపెట్టాడు. మంత్రగాడిపై అనుమానం వచ్చిన మంజునాథ్ నేరుగా అక్క నాగవేణి ఇంటికి వచ్చాడు. ఇక్కడ కూడా చేతబడి చేసిన వస్తువులు తొలగించేందుకు ఏదో ఒకటి చేయమని ఇంట్లో అందరికీ చెప్పాడు.

మాంత్రికుడిని ఇంటి నుండి వెంబడించాడు. మాంత్రికుడి చేస్తున్న నాటకాలను మంజునాథ్ అతని మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి వాట్సాప్ లో షేర్ చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో తాము కూడా మోసపోయామని ఆమదల్లి, చిట్టాకుల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల అమాయకత్వాన్ని పెట్టుబడిగా పెట్టి గ్రామ ప్రజలను మోసం చేసి వేల రూపాయలు వసూలు చేసి మంత్రగాడి కోసం స్థానికులు గాలిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !