- పరారీలో లో ఉన్న డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య
- ఆచూకీ తెలిసిన వారు తెలుపగలరు -ఆదివాసి సేన జిల్లా కమిటీ సభ్యులు కుర్సం బాబూరావు
మన్యం న్యూస్, అశ్వారావుపేట, జులై 01: పరారీలో లో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరులు డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య ఆచూకీ తెలిసిన వారు తెలుపగలరు అని ఆదివాసి సేన జిల్లా కమిటీ సభ్యులు కుర్సం బాబూరావు ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో వాగొడ్డుగుడెం గ్రామంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ పరారీలో లో ఉన్న డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య ఆచూకీ తెలిసిన వారు తెలుపగలరనీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రకారం, అశ్వాపురం పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదైన డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య పరారీలో ఉన్నాడని, ఎంత వెతికినా దొరకడం లేదు అని, పోలీస్ శాఖ వారు కోర్టుకు తెలిపినారని అన్నారు. ఆయన ఆచూకీ తెలిసినవారు మీయొక్క సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వగలరని ప్రకటనలో తెలిపారు. కళ్ల ముందు నిందితులు సభలు, సమావేశాలు, పెడుతున్నా పోలీసులకు కనిపించడం లేదా అని, చట్టం ముందు అందరు సమానులే అయినప్పుడు, నిందితులనూ అధికారులు అరెస్టు చేయకపోవడానికి గల కారణాలేమిటో బహిరంగంగా తెలపాలని రాజకీయ పలుకుబడి వున్న నాయకులకు మినహాయింపులు ఎవరి మెప్పుకోసం అని ఎవరి ఆస్తులు కాపాడుకోవడం కోసం ప్రయత్నము చేస్తున్నారని అసలైన పేదలకు న్యాయం జరిగేది ఎప్పుడో విధానం తెలియజేయాలని అమాయకుల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేదా అంటూ ఈ ప్రభుత్వాలలో రక్షణ కరువైందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి జిల్లా కమిటీ సభ్యులు కనితి వెంకటేష్, రైతు సేన, విద్యార్థి సేన, కార్మిక సేన నాయకులు పాల్గొన్నారు.