UPDATES  

 పేదింటి ఆడబిడ్డలకు బాసటగా మేముసైతం

పేదింటి ఆడబిడ్డలకు బాసటగా మేముసైతం

-పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకే..
ప్రజా సేవకు శ్రీకారం .. ప్రభుత్వ విప్ రేగా.
డాక్టర్ నందకిషోర్, ఇన్కమ్ టాక్స్ కమీషనర్ జీవన్ లాల్…..
వృద్ధాశ్రమ నిర్వాహకులకు సన్మానం:

50 మంది మహిళలకు కుట్టుమిషన్లు, 150 మందికి శిక్షణ సర్టిఫికెట్లు పంపిణీ –
సభలో అలరించిన మిమిక్రీ రమేష్ …
మణుగూరు….. మేముసైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఎంతోమంది పేదింటి ఆడబిడ్డలకు బాసటగా నిలుస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం హనుమాన్ ఫంక్షన్ హాల్లో మేముసైతం మిత్రమండలి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టుమిషన్లు, సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ప్రత్యేక అతిథులుగా ఇన్కమ్ టాక్స్ కమీషనర్-2 హైద్రాబాద్ జీవన్ లాల్, గమన్ మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నందకిషోర్, గౌరవ అతిథులుగా డాక్టర్ జయశ్రీ, అంతర్జాతీయ మిమిక్రీ ఆర్టిస్ట్ రమేష్ లు హాజరయ్యారు. వీరిని వేదపండితుల మంత్రోచ్చరణల నడుమ మేముసైతం మిత్రమండలి. సభ్యులు ఘన స్వాగతం పలికారు. కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు లాంఛనంగా ప్రారంభించారు. …..
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు అనుకున్నదే తడవుగా రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రభ జీఎం పసునూరి భాస్కర్ తన మేధాశక్తితో ఆలోచించి మేము సైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్టును స్థాపించారన్నారు. ఈ ట్రస్ట్ ద్వారా మరో నలుగురు సహాయంతో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించి.. ఎంతో మంది ఆపన్నులకు, అభాగ్యులకు అండగా నిలిచారని అన్నారు.ప్రధానంగా ప్రపంచ దేశాలను సైతం గడగడలాడించిన కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎంతోమంది ఆకలితో అలమటించారని, వారి ఆకలిని తీర్చడం కోసం పసునూరి భాస్కర్ ట్రస్ట్ సభ్యులతో కలిసి నిరు పేదల ఆకలిని తీర్చారన్నారు. అంతేకాకుండా ఇబ్బందులు పడుతున్న నిరుపేద అభాగ్యులకు అండగా నిలిచారన్నారు. …..
గత ఏడాది భారీ వర్షాలకు మణుగూరు ప్రాంతం అతలాకుతలమైందని, వరద ముంపుకు పలు గ్రామాలు గురై ఎంతో మంది నిరుపేదలు ఇళ్లు మునిగి అనేక అవస్థలు పడ్డారన్నారు. తినడానికి తిండి, త్రాగడానికి నీరు లేని వరద ముంపు గ్రామస్తులకు ఆహార ప్యాకెట్లను అందించి మానవత్వాన్ని చాటుకుందన్నారు. ఆపదలో ఉన్నవారికి చేయూతనిస్తూ ఎన్నో. కార్యక్రమాలు చేపట్టడం సంతోషదాయకమన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కుట్టు మిషన్న శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి మార్గాన్ని కల్పించి.. వారి ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ప్రశంసనీయమన్నారు. దాతల సహకారంతో మేముసైతం మిత్రమండలి సామాజిక సేవా కార్యక్రమాలు మరింత విస్తృత పర్పాలన్నారు.

మహిళలు ఆర్ధికాభివృద్ధిని మెరుగు పర్చుకోవాలి. ఇన్కమ్ టాక్స్ కమీషనర్ జీవన్ లాల్

మేముసైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను సర్వనియోగం చేసుకుని పేదింటి ఆడబిడ్డలు ఆర్థికాభివృద్ధి మెరుగుపర్చుకోవాలని ఇన్కమ్ టాక్స్ కమీషనర్ హైద్రాబాద్ జీవన్ లాల్ అన్నారు. మేము సైతం ఏ. మంత్రమండలి ట్రస్ట్ కుట్టుమిషన్, బ్యూటిషియన్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసే మహిళలకు ఉచితంగా శిక్షణ ఇవ్వడమే కాకుండా కుట్టుమిషన్ శిక్షణ పొందిన మహిళలు ఆర్ధికంగా ఎదిగేందుకు పుట్టింటి కానుక పేరుతో కేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆడబిడ్డలకు తోబుట్టువై ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ట్రస్ట్ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రభ జీఎం పసుమారి భాస్కర్ సేవలు ఎంతో హర్షణీయమన్నారు. మహిళలకు కుట్టుమిషన్లు అందజేస్తూ కుటుంబ ఆర్ధికాభివృద్ధికి తో డ్పాటును అందించడమే కాకుండా జీవనభృతి కల్పించడం ఆయనకు ఆయనే సాటి అని అన్నారు. మున్ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి మేముసైతం మిత్రమండలి ట్రస్ట్ సేవలను మణుగూరు ప్రాంతానికే కాకుండా ఇతర ప్రాంతాలకు వి స్తరించాలని ఆయన ఆకాంక్షించారు.మేముసైతం మిత్రమండలి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుట్టింటి కానుక పేరుతో తోగ్గూడెం, సమితిసింగారం గ్రామపంచాయితీల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కుట్టుమిషన్ కేంద్రాలను ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దోసపాటి వెంకటేశ్వరరావు, ప్రముఖ డాక్టర్ జయశ్రీ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం అనాధ వృద్ధులను చేరదీసి తల్లిదండ్రుల వలే సేవలందిస్తున్న అశ్వాపురం మండలంలోని ఆరీఫా అండ్ రోష్నీ వృద్ధాశ్రమ నిర్వాహకులు షెహనాజ్ బేగంను పట్టణంలోని అమ్మనాన్న వృద్ధాశ్రమ నిర్వాహకులు భూక్యా ప్రసాద్ తార దంపతులను అతిథుల చేతుల మీదుగా శాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలతో సత్కరించారు. అనంతరం మేముసైతం మిత్రమండలి ద్వారా వృత్తివిద్యా కోర్సులకు శిక్షణ అందిస్తున్న శిక్షకులు రమా, కళ్యాణి, కరుణారెడ్డి, లక్ష్మణ్ లను శాలువాలతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. అదే విధంగా కుట్టుమిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న 50నుంచి మహిళలకు కుట్టుమిషన్లు 150మందికి శిక్షణ ధృవీకరణ పత్రాలను డాక్టర్ నందకిషోర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా మిమిక్రీ రమేష్ ప్రదర్శన అందరిని అలరించాయి. ….ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఇన్కమ్ టాక్స్ కమీషనర్ జీవన్లాల్, గమన్ హాస్పటల్ చైర్మన్ డాక్టర్ నందకిషోర్, డాక్టర్ జయశ్రీ, మిమిక్రీ రమేష్, మేముసైతం మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దోసపాటి వెంకటేశ్వరరావు, ప్రముఖ కాంట్రాక్టర్ పినిచారి. పట్టణ ప్రముఖులు దండా రాధాకృష్ణ, మేము సైతం మిత్రమండలి గౌరవ సలహాదారులు వేణు రెస్టారెంట్ అధినేత లక్కం లక్ష్మీనారాయణ, బేతంచర్ల వెంకటేశ్వరరావు, బాలాజీ స్వీట్స్ యలగల రంగారావు, సిఐ ముత్యం రమేష్, ట్రస్ట్ కన్వీనర్ దోసపాటి నాగేశ్వరరావు, కార్యదర్శి మార్తి శ్రీనివాసరావు, కోశాధికారి రంగా శ్రీనివాసరావు, కార్యక్రమాల నిర్వహణ ఇంచార్జి చిందుకూరి ఏడుకొండలు, సభ్యులు గోద్రెజ్ రమణ, మంగి మల్లికార్జున్, మేకల గోపి చంద్రకాని వినీల్ కుమార్ రాబిన్ కుమార్ హ్యాండ్ రైటింగ్ హుస్సేన్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !