ముఖ్యమంత్రి కెసిఆర్, ఎమ్మెల్యే రేగా చిత్రపటానికి పాలాభిషేకం
మన్యం న్యూస్ గుండాల, ఆళ్లపల్లి: ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుల చిత్రపటాలకు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, పిఎసిహెచ్ చైర్మన్ రామయ్య ఆధ్వర్యంలో మర్కోడు గ్రామంలో పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న పోడు రైతుదారులకు పట్టాలను అందించిన ఇరువురికి పాలాభిషేకం చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషితోనే పోడుపట్టాల కల నెరవేరిందని అన్నారు మొత్తం ఆళ్లపల్లి మండలంలో 2072 మంది రైతులకు 13622 ఎకరాలనున్నట్లు ఆయన పేర్కొన్నారు జులై ఏడో తారీఖు ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతుల మీదుగా పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కోడ్ సర్పంచ్ శంకర్ బాబు, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు
