మన్యం న్యూస్ దుమ్ముగూడెం జులై 2::
సిపిఐ పార్టీ పోరాటం వల్లే పోడు భూములు పట్టాలు పంపిణీ ప్రభుత్వం మంజూరు చేసిందని సిపిఐ పార్టీ జిల్లా సమితి సభ్యులు నోములు రామిరెడ్డి అన్నారు మండలంలోని ఆర్లగూడెం గ్రామంలో రాజు అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ సర్పంచ్ కొర్స రమేష్ పాల్గొని మాట్లాడుతూ సిపిఐ పార్టీ పోరాటం ఫలితంగానే ఆర్లగూడెం కమలాపురం ఎర్ర బోరు గ్రామాల ప్రజలకు పోడు భూములు పట్టలు పంపిణీ చేయడం జరిగిందని కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వాలు అమాయక గిరిజనులు సాగు చేసుకుంటున్నా భూములను లాక్కోవడానికి ప్రయత్నాలు చేశారని ఫారెస్ట్ అధికారులచే వారి యంత్రాలతో కందకాలు తవ్వుతూ గిరిజనులపై పిడి కేసులు నమోదు చేసుకుంటూ భయభ్రాంతులకు గురి చేశారని ఎక్కడ కూడా తగ్గని సిపిఐ పార్టీ ప్రజలకు అండగా నిలిచి భూమిని కాపాడుకోవడం జరిగిందని ఈనాడు అందరికీ పొడు పట్టాలు రావడం జరిగిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సహయ దర్శి రమేష్ కోటేశ్వరరావు లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.