మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
గురు పూర్ణిమ (ఆషాఢ పౌర్ణమి) వేడుకలను పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లో బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కొత్తగూడెం జిల్లా కన్వీనర్ కమల రాణి (శరణ బోధి) అధ్వర్యంలో ఆదివారం లక్ష్మీదేవి పల్లి మండలం కారు కొండ రామవరం లోని గుట్టపై బౌద్ద ఆరామాలు వద్ద గురు పూర్ణీమ వేడుకలు ఘనంగా జరిగాయి…ఇందులో ముఖ్య అతిథిగా సిద్ధ రక్షిత బంతి జి హాజరు అయ్యి గురు పౌర్ణమి గురించి విశదీకరించారు. దమ్మా ప్రవచనాలు,ధమ్మా సూత్రాలు, బుద్ధ వందనం చేసి అనంతరం బౌద్ద ఆరామాలు వద్ద రావి మొక్కలను నాటారు.ముఖ్య అతిథిలుగా సింగరేణి డివైజయం భీబత్స సతి సమేతంగా హాజరయ్యి బుద్దుని బోధనలు గురుంచి తెలిపారు. శరణబోది కమలారాణి మాట్లాడుతూ. ప్రపంచంలో మానవాళి మనుగడ కోసం శాంతి ప్రబోధాలను బోధించేందుకు తన శిష్య బృందంతో సంచరిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలంలోని కారుకొండ గుట్టలపై గౌతం బుద్ధిని శిష్యులకు జ్ఞాన బోధన చేసిన ఆనవాళ్లు ఉన్నాయని అలాంటి కాకతీయ కాలంనాటి గౌతమ బుద్ధిని ఆనవాళ్లను చూపుతూ వెలసిన అనేక విగ్రహాలను పరిరక్షించుకోవాలని కారుకొండ గుట్ట ప్రాంతాన్ని గౌతమ్ బుద్ధుని జ్ఞాన సంపదగా పర్యాటకుల కోసం అభివృద్ధి పరిచేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని అంతరించిపోతున్న కాకతీయ కాలంనాటి ఈ విగ్రహాలను పరిరక్షించుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఈ కార్యక్రమంలో రాధ కృష్ణ,తాండ్ర వెంకటేశ్వర్లు,డాక్టర్ కృష్ణయ్య ,రజినీ అంబేడ్కర్ ,గోడ రమేష్,ధర్మారావు,డాక్టర్ అలవాల రవి, నభి అంబేడ్కరిస్ట్,బిక్కులాల్ షాలిక్ బడకే,మాధవి,పార్వతి,లక్ష్మి,పద్మ,ఉష,స్రవంతి,నరేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.