UPDATES  

 కెసిఆర్ బడుగు జీవుల పై వివక్షత విడనాడాలి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్

  • గ్రామపంచాయతీలలో సమ్మె సైరన్
  • గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె జులై 6 నుంచి జయప్రదం చేయండి :
    సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా
  • కెసిఆర్ బడుగు జీవుల పై వివక్షత విడనాడాలి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా సమావేశం కొత్తగూడెం శేషగిరి భవన్ లో జిల్లా అధ్యక్షులు అమర్ అధ్యక్షతన జరిగింది .
ఈ సమావేశం లో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా మాట్లాడుతూ గ్రామాల అభివృధి , పరిశుభ్రం చేస్తూ రెక్కలు ముక్కలు చేస్తూ కార్మికుల కనీస వేతన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన రూ.26 వేలు ఇవ్వకుండా ఇబ్బందులు పాలు చేయటం దురదృష్ట కరం అని అన్నారు .ఈ సమావేశం లో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నరాటి ప్రసాద్ మాట్లాడుతూ జులై 6 నుంచి జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర మొత్తం అన్ని రకాల పనులు బంద్ చెస్తూ సమ్మె పిలువు మేరకు జిల్లా లో అన్ని గ్రామ పంచాయతీ లో -ఎంపీడీవోలకు డిపిఓలకు- సమ్మె నోటిస్ అందించామని , బి ఆర్ ఎస్ అనుబంధ సంఘాలు తో పాటు ఏఐటీయూసీ – సీఐటీయూ ఇఫ్టు ఇతర సంఘాలు మద్దతు తో సమ్మె జరుతున్న నేపథ్యం లో ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతనం రూ.26,500 ఇవ్వాలని, ఇన్సూరెన్స్ రూ.10 లక్షలు , పి ఎఫ్ గ్రాడ్యూటీ రూ.10 లక్షలు , పెన్షన్ రూ. 10 వేలు , హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ,
ఈ కార్యక్రమం లో జిల్లా గౌరవ అధ్యక్షులు వాసిరెడ్డి మురళి , ప్రధాన కార్యదర్శి ఎండి యూసుఫ్ , సురేష్ , కిషోర్ , మంజుల , సారయ్య , సున్నం జ్యోతి , తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !