- పోడు రైతుల గోడు తీర్చిన కేసీఆర్ కు రుణపడి ఉంటాం*
రేగా కృషితోనే పోడు సమస్యకు పరిష్కారం - కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మండల అధ్యక్షులు భాస్కర్
మన్యం న్యూస్ గుండాల: పోడు రైతుల గోడు తీర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు పాదాభివందనమని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్ పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా పోడు రైతు గిరిజనులు పోడు పట్టాలు రాక ఇబ్బందులు పడేవారని అన్నారు అలాంటి గోసలు నేటితో చెల్లు చీటీ అయ్యాయని ఆయన పేర్కొన్నారు. అదిలాబాద్ నుండి అశ్వరావుపేట వరకు ఉన్న పోడు రైతులందరికీ పట్టాలు రావడంతో వారి చిరకాల స్వప్నం నెరవేరిందని అన్నారు. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పోడు భూముల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర పలుమార్లు విజ్ఞప్తులు చేసి పోడు భూముల జీవోను తీసుకువచ్చారని అన్నారు. ఈనెల నాలుగో తారీఖున ప్రభుత్వ ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతుల మీదుగా మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు మొత్తం మండలంలో 4 823 మంది రైతులకు 17926 ఎకరాలు పంపిణీ చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. 60 ఏళ్లలో 3లక్షల ఎకరాలే పంపిణీ చేస్తే కెసిఆర్ ఒక్కరోజే 4 లక్షల 6 వేల ఎకరాల భూమిని పంపిణీ చేశారని ఆయన పేర్కొన్నారు. గతంలో అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు సైతం ఎవ్వరు ఈ సమస్యకు పరిష్కారం చూపకపోగా ఫారెస్ట్ అధికారులు రైతుల వద్దకు వచ్చి భూములు గుంజుకుంటుంటే అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని ఆయన పేర్కొన్నారు. పోడు భూముల శాశ్వత పరిష్కారానికి కృషిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కు ఆదివాసి గిరిజనుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు.కార్యక్రమంలో అధికార ప్రతినిధి టి రాము, గొగ్గల లక్ష్మీనారాయణ కటికం నాగేశ్వరరావు, పోలబోయిన వెంకట్ నర్సు, తాటి కృష్ణ , బొమ్మెర్ల సతీష్ , రాంబాబు, సుధాకర్, జాడి ప్రభాకర్ , గుగ్గిల రాంబాబు, చాట్ల సూర్యనారాయణ, జోగ రాంబాబు,తదితరులు పాల్గొన్నారు
