మన్యం న్యూస్ చండ్రుగొండ, జులై 02 : మండల కేంద్రమైన చండ్రుగొండలో గల సాయిబాబా ఆలయం సోమవారం జరుగనున్న గురుపౌర్ణమి వేడుకలకు ముస్తాబైంది. ఆదివారం ఆలయంలో ఏర్పాట్లను ఆలయ చైర్మన్ చీదెళ్ల పవన్ కుమార్, వేదపండితులు వివిఆర్ కె మూర్తి పర్యవేక్షించారు. గురుపౌర్ణమి రోజున మంగళతోరణాలు,అభిషేకాలు, సాహస్రనామార్చనలు, 9గంటలకు పల్లకి సేవ కార్యక్రమాలతో పాటు, మధ్యాహ్నం భక్తులకు మహ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ చైర్మన్ తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు