మన్యం న్యూస్ వాజేడు
మండలంలో గత 12 రోజులుగా గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు నెలసరి వేతనాలు పెంచాలంటూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వాలంటూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ప్రతి మండలంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. సోమవారం నాడు గ్రామపంచాయతీ కార్మికులు వినూత్నంగా గ్రామ గ్రామాన బిక్షటన చేస్తూ ప్రభుత్వానికి నిరసన తెలిపారు మా యొక్క న్యాయమైన సమస్యను ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికుల మండల అధ్యక్షులు పూణేమ్ ప్రసాద్ ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు, ఆదినారాయణ షణ్ముఖ చారి, సనత్ కుమార్ చారి పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.