మన్యం న్యూస్ గుండాల: ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మండల కేంద్రంలోని కుటుంబాలను పరామర్శించారు. శనివారం రాత్రి మరణించిన ప్రభుత్వ ఉద్యోగి జవాజి సుధాకర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. పార్టీ పంచాయతీ వార్డు మెంబర్ మొక్క సమ్మక్క భర్త ఆయన ఆదినారాయణ అనారోగ్యంతో మరణించడంతో వారి నివాసానికి వెళ్లి పరామర్శించి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. వీటితోపాటు కొద్ది రోజుల క్రితం పార్టీ కార్యకర్త అయిన గంగాధరి నాగన్న తల్లిగారు మరణించడంతో ఆయన నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అనంతరం జిల్లా అధికార ప్రతినిధి అన్వర్, సిపిఐ విద్యార్థి నాయకులు షాహిద్ బంధువు కొన్ని నెలల క్రితం మరణించడంతో వారిని సైతం పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్, నియోజకవర్గ నాయకులు రాంబాబు, మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, పంచ్ నరసింహారావు,అధికార ప్రతినిధి రాము, యువజన విభాగం అధ్యక్షులు అజ్జు, బీసీ సెల్ అధ్యక్షులు రమేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాములు, ఎస్టీ సెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, పార్టీ నాయకులు వట్టం రవి, ఆటికం నాగేశ్వరరావు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
