మన్యం న్యూస్ గుండాల: జిల్లాలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అందరిని రెగ్యులర్ చేయాలని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంగం ప్రధాన కార్యదర్శి నరేష్, మండల అధ్యక్షులు పుష్ప రాజ్ వినతి పత్రాన్ని అందించారు. ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు పూర్తయిన కార్యదర్శులకు మాత్రమే రెగ్యులర్ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో అలా చేయడం ద్వారా కొంతమందికే లబ్ధి చేకూరుతుందని అందుచేత ఎటువంటి నిబంధనలు లేకుండా అందరినీ రెగ్యులర్ చేయాలని ఆ వినతి పత్రంలో వారు పేర్కొన్నారు. ఓ పి ఎస్ లు అందరిని జెపిఎస్ లుగా కన్వర్ట్ చేసి వారిని కూడా రెగ్యులర్ చేయాలని వారు కోరారు. ఈ అన్నిటిని క్లుప్తంగా ఉన్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు డి రమేష్ , కే శ్రీనివాస్, బి త్రిలోక్, వి సతీష్ , సిహెచ్ జ్యోతి పాల్గొన్నారు
