UPDATES  

 రైతులారా ఆలోచించి నిర్ణయం తీసుకోండి

రైతులారా ఆలోచించి నిర్ణయం తీసుకోండి
*కాంగ్రెస్ పాలనలో రైతులు నట్టేట మునిగినట్టే
రైతులు ఆలోచించి అడుగు వేయాలని కోరిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం న్యూస్ గుండాల, ఆళ్లపల్లి: రైతులారా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు రైతులను కోరారు. సోమవారం ఆళ్లపల్లి మండలంలో పర్యటించి రైతు వేదికలో రైతులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పాలనలో రైతులంతా కష్టాలతోనే నెట్టకొచ్చేవారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ వస్తేనే వార్త అని నేడు బీఆర్ఎస్ పాలనలో కరెంట్ పోతే వార్త అన్నారు ఆనాడు లో కరెంటుతో మోటర్లు కాలిపోయేవని రైతులకు పెను నష్టం వాటి లేదని అన్నారు. అన్నదాతలు కాంగ్రెస్ పాలనలో పెరుగు అన్నంలో పురుగుల మందు కలుపుకుని తినేవారని అలాంటి పరిస్థితులు మళ్లీ రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని ఆయన అన్నారు. రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతాంగం వెన్నుదండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధులు భవాని శంకర్, అన్వర్, నియోజకవర్గ నాయకులు వట్టం రాంబాబు, మండల అధ్యక్షులు నరసింహారావు, జడ్పిటిసి నరసింహారావు,ఎంపీపీ మంజు భార్గవి, రైతు సమన్యాసంతి అధ్యక్షులు వెంకటేశ్వర్లు, పి ఎస్ ఏ చైర్మన్ రామయ్య, పార్టీ నాయకులు సుబ్బారావు, ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !