మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండలం లోనీ తాలిపేరు ప్రాజెక్ట్ కు ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్ర లో కురుస్తున్న వర్షాల వలన భారీగా వరద నీరు వస్తుంది.దీనితో ప్రాజెక్ట్ అధికారులు మంగళవారం సాయంత్రం 22 గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి 26,558 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేయడం జరిగింది.ఎగువన ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో పడుతున్న వర్షాల వలన రానున్న రెండు మూడు రోజుల్లో ఈ వరద నీరు వలన గోదావరి మరింత పెరిగే అవకాశం ఉన్నందున స్థానిక అధికారులు అప్రమత్తం అయ్యారు.