UPDATES  

 కలగా మిగిలిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లబ్ధిదారులకు కేటాయించాలి.. సిపిఎం ఎంపీటీసీ వంశీకృష్ణ, న్యూ డెమోక్రసీ సాయన్న డిమాండ్.

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం జులై 18::
అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామన్న తెలంగాణ ప్రభుత్వం కలగానే మిగిలిపోయిందని ఇప్పటివరకు లబ్ధిదారులకు ఇల్లు కేటాయించడంలో ఎందుకు ఆలస్యం అవుతుందో అర్థం కావడం లేదని ప్రభుత్వం దృష్టి సారించి అర్హులైన వారికి డబల్ బెడ్ రూమ్ ఇల్లుకేటాయించాలని రేగుబల్లి ఎంపీటీసీ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వంశీకృష్ణ డిమాండ్ చేశారు. తన పరిధిలోని మూడు పంచాయతీలకు ఇప్పటివరకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించలేదని వెంటనే అర్హులైన పేదరికి ఇల్లు మంజూరు చేయాలని ఎంపీడీవో ముత్యాలరావుకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి రమణ రాజన్న వెంకటమ్మ పాల్గొన్నారు. ఇళ్ల స్థలాలు కేటాయించాలి ప్రగతిశీల సాయన్న డిమాండ్ గృహలక్ష్మి పథకం ద్వారా పెద్ద ఆర్లగూడెం గిరిజనులకు రెండు పడకల ఇల్లు మంజూరు చేయాలని సిపిఎంఎల్ ప్రజాపంద వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి సాయన్న డిమాండ్ చేశారు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో గ్రామస్తులతో కలిసి వినతి పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గూడు లేక గిరిజనులు గుడిసెల్లో జీవనం సాగిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం వచ్చి పది సంవత్సరాలు కావస్తున్న పక్క గృహాలకు నోచుకోలేదని అన్నారు ప్రభుత్వం ప్రకటించిన గృహలక్ష్మి పథకం కింద మండలానికి ఎక్కువ సంఖ్యలో ఇల్లు మంజూరు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుశీల రామాదేవి సమ్మక్క నాగమణి పద్మ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !