సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలి
-సీఎం రిలీఫ్ ఫండ్ తో పేదల జీవితాలలో వెలుగులు
– తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మణుగూరు : మండలం లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మంగళవారం పాపమ్మ కి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 35 వేల రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును వారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదల పాలిట వరం సీఎం రిలీఫ్ ఫండ్ అన్నారు, ఆస్పత్రులో చికిత్సలు చేయించుకొని ఆర్థిక సహాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పించారన్నారు.