- అశ్వారావుపేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ రాష్ట్రానికి ఆదర్శం
- రూ.150కోట్ల వ్యయంతో నిర్మాణం
- ఎమ్మెల్యే మెచ్చాని ఆహ్వానించిన ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామ కృష్ణ
మన్యం న్యూస్, అశ్వారావుపేట, జులై, 18: ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ రాష్ట్రానికే అశ్వారావుపేట ఆదర్శం, రైతులు ఇబ్బందీ పడకూడదనే ఉద్దేశంతో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో అశ్వారావుపేటలో మరో ఫ్యాక్టరీ నిర్మాణం కోసం రూ .150 కోట్లు మంజూరు చేయించారు. బుధవారం అశ్వారావుపేటలో రూ.37 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామ కృష్ణ అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు వారి నివాసంలో దమ్మపేట మండలం, తాటి సుబ్బన్న గూడెంలో కలిసి ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫామ్ సాగు తదితర విషయాలపై ఇరువురు చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో మ్యానేజర్ లు బాల కృష్ణ, కళ్యాణ్, నాగబాబు, చీమకుర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.