మన్యం న్యూస్ గుండాల: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ కార్మికులు సమ్మెబాట పట్టారు. గ్రామపంచాయతీ కార్మికుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ధర్నా నిర్వహించి ఎంపీడీవో సత్యనారాయణకు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం జేఏసీ నాయకులు కొమరం శాంతయ్య, యాసారపు వెంకన్నలు మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ 13 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు జీవో 60 ప్రకారం పి ఆర్ సి వేతనాలు పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రామనాథం, సంపత్, రామారావు, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు
