- సొగసు చూడతరమా…
బొగత జలపాతం తెలంగాణకుఒక అద్భుతం - 50 అడుగుల ఎత్తు నుంచి జాలవారుతున్న జలపాతం
- చుట్టూ కొండలు, పచ్చని చెట్లతో ప్రకృతి అందాలు కమనీయం రమణీయం
- తెలంగాణ నయాగారా (బొగత జలపాతం) అందాలు చూడతరమా
- పర్యటకులను కట్టిపడేసే అందాలు బొగత జలపాతం సొంతం.
మన్యం న్యూస్ వాజేడు
ప్రకృతి సృష్టించిన అందాలలో బొగత జలపాతం ఒక అద్భుతం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బొగత జలపాతానికి తెలంగాణ నయాగరా జలపాతంగా ఆ పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది.పర్యటకులకళ్ళు కట్టిపడేసే అందాలు, పర్యటకులు ఒక్కసారి చూస్తే తనివి తీరదు,బొగత జలపాతం హొయలతో మళ్లీ మళ్లీ ఈ సుందరమైన జలపాతానికి స్వాగతం పలుకుతాయి. ఎగువన కురిసిన వర్షాలకు నల్లెం దేవి వాగు, కర్రెగుట్ట, ఇతర వాగులు వంకలు పొంగిపొర్లుతు, బొగత జలపాతం లోకి వచ్చి 50 అడుగుల ఎత్తు నుండి జలపాతం లోకి దూకుతూ గాలిలోకి మంచు పొరలు తెల్లని పాల నురగల తేలిపోతుంటే ఆ జలపాతం హోయలు చూసేందుకు చతిస్గడ్, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, రాష్ట్రాల నుండి పర్యటకులు వచ్చి బొగతా జలపాతం లో సందడి చేస్తున్నారు. తెలంగాణ నయాగార జలపాతం చుట్టూ నలుపైన కొండలు దట్టమైన అడవి పచ్చని చెట్లతో నిండై న సహజ సంపద సిద్ధంగా ఏర్పడిన ప్రకృతి రమణీయత ఇది, ప్రకృతి అందాలు చూడతరమా పర్యటకులను కట్టిపడేసే, కనువిందు చేసే భౌగోళిక సరిహద్దులు బొగత జలపాతం సొంతం.
స్థానిక సంస్కృతి:
ములుగు జిల్లా వాజేడు మండలంలో చీకుపల్లి గ్రామం పరిధిలో బొగత ఉంది. ప్రధానంగా ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో సువిశాలమైన, సుసంపన్నమైన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబం ఆదివాసిలు, ప్రధానంగా ఆదివాసీలు ఆరాధించే దైవం ప్రకృతి, ప్రకృతికి ఆదివాసీలకు అభినవ భావ సంబంధం కలిగి ఉంటారు. ప్రకృతికి రక్షణ కవచంలా నిరంతరం ఆదివాసీలు రక్షిస్తూ ఆరాధిస్తూ ఉంటారు.బొగత జలపాతం గ్రామ ప్రజలు స్థానికులు స్నేహపూర్వకంగా కలిసి మెలిసి, సందర్శకులకు స్వాగతం పలుకుతారు.. సందర్శకులు స్థానికులతో సంభాషించడం, స్థానిక వంటకాలను ప్రయత్నించడం సమీపంలోని గ్రామాలను సందర్శించడం ద్వారా స్థానిక సంస్కృతి, సాంప్రదాయాలతో కూడా పర్యటకులు అహల్లాదకరంగా, ఆనందంగా మై మరిచిపోయేలా ఆదివాసిల సాంప్రదాయాలు సాంస్కృతికి అద్దంపట్టేలా ఆకర్షనీయంగాఉంటాయి.