- మల్టీపర్పస్ వర్కర్ల సమస్య పరిష్కరానికై కృషిచేస్తా
- అన్నివర్గాల గురించి ఆలోచించే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్
- ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్
మన్యం న్యూస్,ఇల్లందుఇల్లందు పట్టణంలో గ్రామపంచాయతీల మల్టీపర్పస్ వర్కర్స్ జీతాలు పెంచాలని పలుసంఘాల యూనియన్ నాయకులు, మల్టీపర్పస్ వర్కర్లు ప్రదర్శనగా మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్దకు తరలివచ్చి ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ కి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. వినతిపత్రాన్ని తీసుకున్న ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణరాష్ట్ర ఏర్పాటుగాక ముందునుండే అన్ని వర్గాల గురించి ఆలోచించారన్నారు. స్వరాష్ట్రం సాధించాక అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేసేవిధంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిసమస్యను పరిష్కరిస్తూ దేశంలోనే అత్యుత్తమ పరిపాలనతో పాటు అభివృద్ధి, సంక్షేమపథకాలు అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ కీర్తించబడుతుందన్నారు. మీ సమస్యలను ప్రతిదీకూడా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు నావంతు కృషిచేస్తానని ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ తెలిపారు. తమ సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కు మల్టీపర్పస్ వర్కర్లు చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్మికసంఘ నాయకులు యాకూబ్ షావలి, దేవరకొండ శంకర్, నబీ, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసరెడ్డి, నబీ, నీలం రాజశేఖర్, మహిళా అధ్యక్షురాలు నెమలి ధనలక్ష్మి, భాగ్య, సోషల్ మీడియా ఇంచార్జి గిన్నారపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
