UPDATES  

 భారీ వర్షాల దృష్ట్యా అధికారులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.

భారీ వర్షాల దృష్ట్యా అధికారులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.
*చెరువులు,వాగుల పరిసర ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆస్తి,ప్రాణ నష్టంవాటిల్లకుండా పటిష్ట చర్యలు.
*అధికారులు ప్రతి చెరువులో నీటి నిల్వలు పర్యవేక్షించాలి.
*గ్రామస్థాయి నుం చి జిల్లా స్థాయి వరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి.
*లోతట్టు ప్రాంతాలలో ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
*భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాలలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.

మన్యం న్యూస్ ఏటూరు నాగారం
జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా అధికారులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.బుధవారం జిల్లా లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాలైన ఏటూరు నాగారం మండలంలోని అల్లంవారి ఘనపురం,ఎలిశేట్టి పల్లి గ్రామం,వెంకటాపురం మండలంలో బొదపురం, కొడపురం బిడ్జివద్ద గోదావరి నది వరద ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
అనంతరం చల్పాక ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను,ఆలుబాక జిల్లా పరిషత్ పాఠశాలలో పునరావాస కేంద్రాల ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.ఏటూరు నాగారం మండలంలోని చల్పక ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి,ఎలిశెట్టిపల్లి గ్రామం నుండి 150 మందిని తరలించుటకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.ఎన్ డి ఆర్ఎఫ్ బృందం,రెవెన్యూ, పోలీస్ శాఖ,వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రజలకు అందు బాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.జిల్లాలో రానున్న 48 గంటల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపినందున అధికారు లంతా అప్రమత్తతో,అందు బాటులో వుండాలని ఆదేశించారు.పంచాయితి రాజ్ అధికారులు గ్రామ పరిధిలో పురాతన,శిథిల భవనాలు, గోడలు కూలే పరిస్థితులు ఉన్నట్లైతే,వాటిని గుర్తించి నివాసితులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు.
జిల్లాలో ఉన్న చెరువులు, వివిధ ప్రాజేక్టుల కాల్వలు నీటి నిల్వలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని చెరువులు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలనిసూచించారు.జిల్లాలోని,చెరువులు,కుంటలు,వాగులు వంకల వద్ద మత్తడి పొంగిపోర్లె ప్రాంతాలను గుర్తించి ఎప్పటికప్పుడు 24 గంటలు పర్యవేక్షణచేయాలనీఆదేశిచారు.జిల్లాఅధికారులు,మండలప్రత్యేకఅధికారులుతహసీల్దార్,ఎంపీడీవో,ఎంపిఒ భారీ వర్షాల నేపథ్యంలో హెడ్ క్వార్టర్ లో ఉండి సమన్వయం తో పనులు చేయాలనీ,సెల్ నెట్వర్క్ ఏరియాలో ఉండి,పవర్ బ్యాంకులతో అందు బాటులో ఉండాలని అన్నారు.గ్రామాల్లోని లోతట్టు వంతెనల వద్ద నీటి ప్రవాహం ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తూ,నీటి ప్రవాహం అధికమై నట్లయితే దారులను మూసివేసి బారికేడ్లు,సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు.
జిల్లాలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగ కుండా చర్యలు తీసుకోవా లని,విద్యుత్ పునరుద్దరణ చర్యలు వేగవంతంగా చేపట్టాలని,విద్యుత్ వైర్లు తెగి పడిపోయినట్లయితే వెంటనే మరమత్తులు చేయాలని ఆదేశించారు.భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో గత అనుభ వాలను దృష్టిలో ఉంచుకొని లోతట్టు ప్రాంతాలను గుర్తించి,
అక్కడ ప్రజలను తరలించేం దుకు సమీపంలో క్యాంపులు ఏర్పాటు చేసేందుకు వీలుగా సంసిద్దంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ,ఆస్థి,జంతు నష్టం వాటిల్లకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అవసర మైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.పరిస్థితి మెరుగు పడేవరకు చెరువులు, వాగుల వద్ద చేపలు పట్టడానికి స్నానాలకు అనుమతించవద్దని కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్య క్రమంలో ఏటూరు నాగారం ఏఏస్పి సంకీర్త్, ఏటూరు నాగారం స్పెషల్ ఆఫీసర్ జడ్పీ సీఈవో ప్రసూన రాణీ, వెంకటాపురం స్పెషల్ ఆఫీసర్ డిసిఎస్ఓ అరవింద్ రెడ్డి, జడ్పిటిసి పాయం రమణ,
ఎంపీటీసీ కోట నరసింహులు,
తహసిల్దార్లు వీరస్వామి, నాగరాజు,ఎంపీడీవోలు కుమార్,బాబు,సిఐలు మండల రాజు,శివప్రసాద్,ఎస్సైలు కృష్ణ ప్రసాద్,తిరుపతి రావు,చల్పాక ఆలుబాక,సర్పంచులు చింత సుమతి,ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !