UPDATES  

 నిండుకుండలా గోదావరి 35 అడుగులకు చేరిన నీటిమట్టం ముందస్తు చర్యల్లో కలెక్టర్ ప్రియాంక అలా.

 

మన్యం న్యూస్ బూర్గంపహడ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నిండు కుండగా దర్శనమిస్తోంది గోదావరికి ఎగువనున్న కాళేశ్వరం,ఇంద్రావతి,తాలిపేరు నదుల నుండి వచ్చే వరదల వల్ల బుధవారం రాత్రికి భద్రాచలం వద్ద 35 అడుగులకు గోదావరి చేరుకున్నది.జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అలా ముందస్తు అధికారులను అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాల్లో తిరిగి సందర్శించారు.కాళేశ్వరం ప్రాజెక్టు నుండి 2.35 లక్షల క్యూసెక్కుల నీరు అలాగే ఇంద్రావతి నది నుండి 215 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల కారణంగా బుధవారం ఉదయం పేరూరు వద్ద 5.3 లక్షల క్యూసెక్కులకు చేరినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.అలాగే తాలిపేరు ప్రాజెక్టు నుండి విడుదల చేసిన 60 వేల క్యూసెక్కులతో అర్ధరాత్రి కి భారీ నీరు చేరుతుంది అని కలెక్టర్ ముందుగా సంబంధిత శాఖ అధికారులను అప్రమత్తం చేశారు.ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ముంపుకు గురయ్యే గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.గ్రామ,మండల అలాగే జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని చెప్పారు.పొంగి పొర్లే వాగులు,వంకలు,జలాశయాలను వీక్షించేందుకు ప్రజలు వెళ్లకుండా బారికేడింగ్ తో నియంత్రణ చేయాలని రాకపోకలు నిలిపి వేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు.రహదారుల పైకి నీరు వచ్చిన ప్రాంతాల్లో రవాణా సేవలు నిలిపి వేయాలని ప్రమాద హెచ్చరికల బోర్డులు పెట్టాలని చెప్పారు.రహదారులపై ఎక్కడైనా చెట్లు పడితే తక్షణమే తొలగించాలని చెప్పారు.నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివాసం ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు.విద్యుత్తు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.అత్యవసర సేవలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 08744-241950 వాట్సప్ నంబర్ 9392919743 కు మెసేజ్ కానీ వీడియో కానీ చేయాలని చెప్పారు.కొత్తగూడెం ఆర్డిఓ కార్యాలయంలో 9392919750, భద్రాచలం ఆర్డిఓ కార్యాలయంలో 08743-232444
24 గంటలు పని చేయు విధంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూములకు ఫోన్ చేయాలని ఆమె ప్రజలకు సూచించారు.వర్షాలు వల్ల వాగులు,జలాశయాల్లో భారీగా నీరు చేరుతున్నదని అందువల్ల పశువులు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నదని,మేతకు బయటకు వదలకుండా ఇంటి వద్దనే ఉంచే విధంగా రక్షణ చర్యలు చేపట్టాలని ఆమె పేర్కొన్నారు.మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని,జలాశయాలు వద్ద గజ ఈత గాళ్లను,నాటు పడవలు,లైఫ్ జాకెట్లు,లైఫ్ బాయిస్ లను అందుబాటులో ఉంచాలని చెప్పారు.అత్యవసర సేవలకు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉన్నారని వారి సేవలు వినియోగించుకోవాలని చెప్పారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !