మన్యం న్యూస్ గుండాల: మండలంలో వర్షాలు భారీగా కురుస్తున్నందున వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయని ప్రజలు ఎవరు వాగులు దాటేందుకు ప్రయత్నించవద్దని గుండాల ఎస్సై కిన్నర రాజశేఖర్ సూచించారు. బుధవారం కిన్నెరసాని వాగు ఉదృతంగా ప్రవహిస్తున్న తరుణంలో ఆయన సందర్శించి ప్రజలకు సూచనలు చేశారు. వర్షాలు తగ్గేంతవరకు ప్రజల ఇంటి వద్దనే ఉండాలని ఆయన కోరారు. కరెంటు స్తంభాలను తెగిపడిన తీగలను ముట్టుకోవద్దని సూచించారు. రైతుల కాపరులు సైతం వాగులు దాటేందుకు సాహసం చేయవద్దని ఆయన పేర్కొన్నారు. కలుషిత నీరు తాగటం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతారని వేడి చేసుకున్న నీటిని తాగాలని సైతం ఆయన పేర్కొన్నారు. అత్యవసరమైతే 100 లేదా గుండాల పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి సహాయాన్ని తీసుకోవాలని ఆయన
