మన్యం న్యూస్ వాజేడు
రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. రోజు రోజుకి గోదావరి నీటిమట్టం పెరుగుతుండటంతో వాజేడు మండలంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారి డాక్టర్ కమరం మహేందర్ ప్రజలకు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఇంటి పరిసర ప్రాంతాలలో నీరు చేరుట వల్ల దోమలు, ఈగలు అనేక రకాల కీటకాలు,బ్యాక్టీరియాస్ తయారవుతాయి. తద్వారా జ్వరాలు పలు రకాల వ్యాధులు వస్తాయని ఆయన అన్నారు. కలుషిత నీరు త్రాగటం వలన డయేరియా, జ్వరం, కడుపులో నొప్పి, తలనొప్పి, ఇతర వ్యాధులు వస్తాయని, శుభ్రమైన నీటిని త్రాగాలని అవసరమైతే నీటిని వేడి చేసుకుని త్రాగాలని తెలిపారు. ఇంటి పరిసర ప్రాంతాలలో వీలైనంత శుభ్రంగా పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, 24 గంటలు వైద్య బృందం అందుబాటులో ఉండేందుకు కృషి చేస్తామని, ప్రజలు వైద్య బృందం యొక్క సేవలు సద్వినియోగం చేసుకోగలరని వైద్యాధికారి డాక్టర్ కొమరం మహేందర్ తెలిపారు.