మన్యం న్యూస్ గుండాల: పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని అఖిలపక్ష నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నారు. నిరాహార దీక్షకు అఖిలపక్ష నాయకులు మద్దతు పలికారు అనంతరం గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, మాజీ సర్పంచ్ శాంతయ్య మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా వ్యవహరిస్తుందని అన్నారు. జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచాలని 51 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి ప్రమాదం జరిగితే నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరేష్ , లాలయ్య, రవి, రామనాథం, తోలేం సాంబయ్య, రాంబాబు, ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు
