నిత్యం బిజీగా ఉంటున్నప్పటికీ వృద్ధుల కోరికను దృష్టిలో ఉంచుకొని నెరవేర్చిన ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ మన్యం న్యూస్,ఇల్లందు:ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ తాను ఇచ్చినమాటను నిలబెట్టుకుని వృద్ధుల కోరికను తీర్చారు. వివరాల్లోకి వెళ్తే ఇల్లందు మండలం రేపల్లెవాడ గ్రామంలో ఇటీవల జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే బానోతు హరిప్రియను అజ్మీరవాల్య అనే వృద్ధుడు చెవిపోగులు కావాలని అడిగాడు. అడిగిన వెంటనే నేనుకుట్టిస్తా బాబాయ్ అని మాటఇచ్చి నిలబెట్టుకుని శభాష్ అనిపించుకున్నారు హరిప్రియ నాయక్. కోరిక చిన్నదే అయిన అనేక ప్రజాకార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే ఎమ్మెల్యే బానోతు హరిప్రియ హరిసింగ్ నాయక్ దంపతులు గురువారం రాత్రి స్వయంగా వారిఇంటికి వెళ్లి అజ్మీర వాల్య, అతనిసోదరి ఇస్లావత్ చాందిల కోరికను తీర్చారు. దగ్గర ఉండి వారికి చెవులను కుట్టించారు. ఎమ్మెల్యే దంపతులు స్వయంగా వచ్చిచెవులు కుట్టించడంతో ఆ వృద్ధులు ఆనందం వ్యక్తంచేస్తు, హరిప్రియ దంపతులను చల్లగా ఉండాలని దీవించారు.
