మన్యం న్యూస్: జూలూరుపాడు, జులై 21, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్ల సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం చెందిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ విమర్శించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని పడమట నర్సాపురం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించటం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్స్ అన్ని సమస్యలకు నిలయాలుగా మారాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్స్ ను, విద్యార్థులను విస్మరించిందని, కనీస మౌలిక వసతుల కల్పనలో వైఫల్యం చెందిందని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మేస్, కాస్మో టిక్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో ఖాళీగా ఉన్న కుక్, వాచ్ మేన్, వార్డెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో విద్యార్థి నాయకులు గణేష్, చింటూ, అనిల్ కుమార్, మధు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
