- గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
- అధికారులు అందరూ గోదావరి పరివాహ ప్రాంతాల లో అందుబాటులో ఉండాలి..
- గోదావరి ముంపు ప్రాంతం సున్నం బట్టి గ్రామంలో పర్యటించిన ప్రభుత్వ విప్ రేగా..
మన్యం న్యూస్ దుమ్ముగూడెం జులై 21::
గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలాంటి విపత్తునైన ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. మండల పరిధిలోని సున్నంబట్టి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు విస్తృతంగా ముంపు ప్రాంతాలలో పర్యటించి, గోదావరి నది నీటి ప్రవాహాన్ని పరిశీలించడం జరిగింది, వరద ముంపు బాధితులు పునరావాస కేంద్రాలకు తరలిరావాలని సూచించారు. వర్ష ప్రభావిత ప్రాంతాలలో నెలకొంటున్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా అధికార యంత్రం అందుబాటులో ఉండాలని, వర్షాల వల్ల ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాలలోని వరదల వల్ల కలిగే ప్రమాదాలు ఎప్పటికప్పుడు ఉండే రక్షణ చర్యలు తీసుకోవాలని, ఇప్పటికి వాగులు, వంకులు పొంగుతున్న పరిస్థితులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులందరూ గోదావరి పరిపాక ప్రాంత ప్రజలను అప్రమతం చేస్తూ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా ఆరోగ్య శాఖ అధికారులు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట చర్ల మార్కెట్ కమిటీ అధ్యక్షులు బోధబోయిన బుచ్చయ్య, దుమ్ముగూడెం సీఐ దోమల రమేష్, స్థానిక సర్పంచ్ లక్ష్మి, చర్ల పార్టీ అధ్యక్షులు రాజారావు, మండల టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి రాముడు, అధికార ప్రతినిధి జానీ పాషా, ఉపాధ్యక్షులు కామేశ్వరరావు, కాకి అనిల్, కార్యదర్శి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.