మన్యం న్యూస్ దుమ్ముగూడెం జులై 21::
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నిర్వహ కమిటీని రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఏఐసీసీ ప్రకటించింది. ఈ కమిటీలు భాగంగా 2023 ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యునిగా ఎన్నికైనటువంటి భద్రాచలం శాసనసభ్యులు టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు పొదెం వీరయ్య ఎన్నుకోవడంతో భద్రాచలం నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సోషల్ మీడియా చైర్మన్ కనుబుద్ధి దేవా ఆనందం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన తెలుపుతూ రాబోయే ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అన్ని స్థానాల్లో పొదెం వీరయ్య నాయకత్వంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమ వ్యక్తం చేశారు.